Posts

Showing posts from October, 2022

سیرت محمّد کی روشنی میں ہماری اخلاقی ذمّہ داریاں / Moral Responsibilit...

Image

ముదిమి కష్టాల కొలిమి కాకూడదు అంటే...

Image
  మీరు బలహీనంగా ఉన్నప్పుడు మిమ్మల్ని పుట్టించినవాడు అల్లాహ్ యే. ఆ బలహీనత తర్వాత ఆయన మీకు శక్తి కల్గించాడు. ఆ శక్తి తర్వాత తిరిగి మిమ్మల్ని బలహీనులుగా , వృద్ధులుగా చేస్తున్నాడు. ఆయన తాను తలచిన దాన్ని సృజిస్తున్నాడు. ఆయన సమస్తం ఎరిగినవాడు , సర్వ శక్తిమంతుడు. (రూమ్ / 51-54) ముదిమి అంటే ముసలితనం. ఇది పుట్టిన ప్రతి మనిషికీ జీవిత చరమాంకంలో తప్పదు.   ఎప్పుడైతే మనిషి వయసు పైబడుతుందో , ఎప్పుడైతే మనిషి ముసలి దశకు చేరువవుతాడో అప్పుడు అతని అవయవాలు డీలా పడిపోతాయి. అతనిలో పని చేసే , ఆలోచించే శక్తి క్రమేణా క్షీణించ సాగుతుంది. అతనిలోని భావాలు , ప్రేరణలు చల్లబడతాయి. ఇలాంటి దీన స్థితిలో తాను ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతాడు. ఇతరుల నుండి ప్రేమ , వాత్సల్యాన్ని , మంచి మాటను ప్రవర్తనను ఆశిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే, వయోవృద్ధులు మనం బతకబోయే బతుకు వాళ్లు. మనం నడవబోయే దారి వాళ్లు. ఇప్పటి సమాజాన్ని మనకంటే ముందు స్వప్నించినవాళ్లు. దీని నిర్మాణానికి మనకంటే ముందు రాళ్లెత్తిన వాళ్లు. చరిత్రకు ప్రత్యక్ష సాక్షులు వాళ్లు. వాళ్లు... మనవాళ్లు, మన పెద్దలు, వయోవృద్ధులు. ప్రతి అంశంలోనూ వాళ్లకు ఒక అనుభవం ఉంటుం...

దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు - నీరు (నాటకం)

Image
  మనకు తెలిసీ తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు , పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్‌ను అలాగే వదిలేస్తుంటారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకన్‌కు లీకయ్యే నీటి చుక్క.. రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. వేసవి రాగానే తాగు నీరు లభించక పశుపక్ష్యాదులు మృత్యువాత పడే ఉదంతాలను అనేకం చూసే ఉంటారు. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన పిల్లలు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆ నిమిత్తం పిల్లల్లో మార్పు తీసుకురావాలని చేసిన చిరు ప్రయత్నమే ఇది. ఇందులో పాత్రలు: హసన్   (కెమిస్ట్రీ లెక్చరర్) హఫీజ్   (సామాజిక వేత్త) నదా (వాటర్ సప్లైయిలో ఉద్యోగిని ) హయా   (విద్యార్ధి ని) హమద్   (విద్యార్ధి), హనాన్ (విద్యార్ధి ని). ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. పల్లెకైనా , నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతోంది. ప్రతిప్రాణిని మేము నీటితో సృజించిన విషయాన్ని వీరు గమనించ లేదా ? మరి వారు (మాయీ సృష్టి ...